Shopping cart

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

  • Home
  • Politics
  • విప్లవోద్యమ నాయకుడు, వీర తెలంగాణ పోరాట గెరిల్లా యోధుడు
Politics

విప్లవోద్యమ నాయకుడు, వీర తెలంగాణ పోరాట గెరిల్లా యోధుడు

Email :32531

కామ్రేడ్ డేగల మధుసూదన్ 1990 మే 16న సూర్యాపేటలో కన్నుమూశారు. ఆయన ఆత్మకూరు గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. దానికంటే మించి ఆత్మకూరు గ్రామంలో ప్రజా సేవకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆత్మకూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల హక్కుల కోసం, పేదల అభ్యున్నతి కోసం, అట్టడుగు వర్గాల వెట్టి చాకిరి విముక్తి కోసం, ఆయన జీవితకాలం పోరాడి ప్రజలకు మార్గదర్శకుడిగా నిలిచారు. తండ్రి రామ నరసయ్య, తల్లి నరసమ్మ, ఆయన తోబుట్టువులు యాదగిరి,నరసయ్య చిన్న వయసులోనే తల్లి చనిపోయింది అందువల్ల కుటుంబ బాధ్యతలు స్వీకరించడం తో వ్యక్తిగత క్రమశిక్షణ కుటుంబ క్రమశిక్షణ కూడా బాగా అలవడింది. అయితే శ్రామిక వర్గం కాబట్టి సహజంగానే దొరల అణిచివేత ఈయనపై కూడా పడింది. ఆ రోజుల్లో ఊరంతా దొరల ఏలుబడిలో ఉండేది చలకలు, భూములు అన్ని వారివే ఒకరోజు ఏదో అవసరం ఉండి దొరవారి కంచలో కట్టెలు కొట్టాడు. అప్పుడు ఆ దొర మల్సూర్ ను పట్టుకుపోయి గడి లో కూర్చోబెట్టి బెదిరించారు. ఆ సమయంలో డేగల వీరమల్లు (మధుసూదన్ పెద నాన్న)ప్రమేయంతో గడి నుండి బయటకు వచ్చాడు.

ఇలా దొరల దౌర్జన్యం గమనించి పేదలవైపు నిలబడాలని భావించే స్వభావం వల్ల ఆయన ఎర్రజెండాను పీడిత ప్రజల జెండాగా భావించారు. ఆ జెండా నాయకత్వంలో జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన పాత్రను నిర్వర్తించాడు. తన 18వ ఏట ఇల్లు వదిలి భార్యను వదిలేసి దళం లోకి వెళ్లిపోయారు. ఆ రోజుల్లో కందగట్ల గుట్ట శిక్షణా కేంద్రంగా ఉండేది.అక్కడే తుపాకీ పేల్చడం నేర్చుకున్నాడు. కందగట్ల గుట్ట వద్ద శిక్షణ పొందుతున్న తన అల్లుని ఇంటికి తీసుకురావాలని మామ బత్తుల పాపయ్య చేసిన ప్రయత్నం విఫలమయింది. చివరకు ఆయన సాయుధ పోరాటంలో ముందుకు వెళ్లిపోయారు.

Ads Image

మొదట భీమిరెడ్డి నరసింహారెడ్డి దళం, తర్వాత గొట్టిముక్కల గోపాల్ రెడ్డి దళం,ఆ తర్వాత కొండల్ రెడ్డి దళంలో పనిచేశారు. ఆ దళంలో ఉండగానే చక్రయగుట్టకు పోలీసుల దాడిలో దొరికి 1948 నుండి 1952 వరకు నాలుగు సంవత్సరాలు జాల్నా, ఔరంగాబాద్ జైల్లో ఉన్నారు కొద్దికాలం హైదరాబాద్ జైల్లో నుంచి అక్కడి నుండి ఈ జైళ్ళ కు మార్చారు. అవి పూర్వపు నిజాం రాజ్యంలోనే ఉన్న కర్ణాటక మహారాష్ట్రకు చెందినవి. జైలు నుండి విడుదల కాగానే మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.నేరుగా ఇంటికి రాకుండా పార్టీ పిలుపు మేరకు ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. జైల్లోనే అక్షరజ్ఞానం అబ్బింది. అక్కడే పెద్ద బాలశిక్ష చదువుకొన్నారు.ఎందరో మేధావుల సరసన అనేక విషయాలు నేర్చుకుని తప్పులు లేకుండా తెలుగు రాయడం, భూముల కొలతలు, ఇతర కొలతలు, లెక్కలు, పత్రాలు రాయడం అన్నింటిని ప్రజల కోసం వినియోగించి ప్రజా నాయకుడిగా నిలబడ్డాడు.

సాయుధ పోరాట కాలంలో ఆయన గన్ను పట్టడంతో పాటుగా గొప్ప కళాకారుడిగా గొల్ల సుద్దులు ప్రదర్శించేవారు. ఆయనకు వంతగా కొద్ది కాలం పాటు బుడిగ భద్రయ్య,మరికొద్ది కాలం పాటు గు నగంటి భద్రయ్యలు ఉండేవారు. కళాకారునిగానే కాక గొప్ప ఫైటర్గా సూర్యాపేట తాలూకాలో మిలిటెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే నాయకులలో ఆయన ఒకరుగా ఉండేవారు. వైజ్ఞానిక కార్యక్రమాల్లోనూ సాయుధ పోరాటంలోనూ తన ఉదాత్తమైన పాత్రను నిర్వర్తించి కుటుంబ జీవితంలోనూ మచ్చ లేకుండా క్రమశిక్షణకు మారుపేరుగా గడిపి ఉత్తమ కమ్యూనిస్టుగా నిలిచారు. శత్రునిర్బంధాన్ని ఎన్నడూ ఖాతరు చేయలేదు .తీవ్ర నిర్బంధంలో సూర్యాపేట పట్టణంలో ఇంటిపైన ఎర్ర జెండా పెట్టుకొని ఇంటినే పార్టీ కార్యాలయంగా వాడుకోవడం తో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొక్కవోని దీక్షతో జీవిత చరమ కాలం పాటు ఎర్రజెండా ముద్దుబిడ్డగా నిలిచిన కామ్రేడ్ డేగల మధుసూదన్ 34వ వర్ధంతి సందర్భంగా జోహార్

Every sunrise awakens a new adventure, waiting to be embraced.

Robert Milton
Related Tags:

Comment (1)

  • August 31, 2023

    Tnews

    Whether it\'s breaking news, expert opinions, or inspiring athlete profiles, your blog delivers a winning combination of excitement and information that keeps.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Verified by MonsterInsights