Shopping cart

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

  • Home
  • Politics
  • ఆత్మాహుతులన్నీ సర్కారు హత్యలే
Politics

ఆత్మాహుతులన్నీ సర్కారు హత్యలే

Email :147

టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

హైదరాబాద్ ఏప్రిల్ 23( మన దీపం)
కార్మికులు సమ్మె చేసిన ప్రతి సందర్భంలో ఇలాంటి ఆత్మాహుతులు జరుగుతూనే ఉన్నాయి. పోరాడి సాధించుకోవలసిన హక్కుల్ని పాలకులు గౌరవించకపోవడంతో ఆత్మాహుతి మాత్రమే తమ చేతిలో ఉన్న ఆఖరి పోరాటంగా కార్మికులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ ఆత్మాహుతికి పాల్పడగా ఆ సంఘటనపై జాన యాదవ్ ధ్వజమెత్తారు

ఇలాంటి సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహుతికి పాల్పడి మరణించాడని ఆ నేపథ్యంలో చాలామంది కార్మికులు ఇలాంటి సంఘటనలకు తెగబడుతున్నారని అన్నారు.

కార్మిక వర్గం ఆత్మహుతి పద్ధతులకు దిగకుండా సంఘటిత పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలని పార్టీ పక్షాన విజ్ఞప్తి చేశారు.. రాష్ట్రంలో సమ్మె జరుగుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల కార్మికులు తమ సమస్యలకు చావే పరిష్కారం అని భావిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఈ సమ్మెను విరమింప చేసే దిశగా చర్చలు జరిపి కార్మికులకు విశ్వాసాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కార్మికులు సంయమనం కోల్పోకుండా సంఘటితంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని కార్మికులను పిలుపునిచ్చారు.అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు.రాష్ట్రంలో కొనసాగుతున్న సమ్మెను విరమింప చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి అధికారులను ఎక్కడికక్కడ కార్మికులు ఘోరావ్ చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Verified by MonsterInsights