కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీలు మైనార్టీలకు ద్రోహం చేశాయి.
రాబోయే రోజుల్లో ఎంబీటి
టిఆర్పితో కలిసి పోరాడుతుంది.
రాష్ట్రంలో 90 వేల కోట్ల విద్యా వ్యాపారం సాగుతుంది
ఈ వ్యాపారంలో 73% వాటా ప్రజా ప్రతినిధులదే కావడం సిగ్గుచేటు
ఏప్రిల్ 26 ధర్నా విజయవంతం చేయాలి
ప్రెస్ క్లబ్ లో టిఆర్పి వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న సాక్షిగా మైనార్టీ నాయకుల ప్రకటన
హైదరాబాద్ ఏప్రిల్ 23( మన దీపం ) రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీలు మైనారిటీలకు ఎలాంటి సహకారాన్ని అందించలేదని రాజకీయ వాటాను అందించడంలో రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ఎంబి టీ నాయకులు అంజాదుల్లా తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంబి టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదని తెలంగాణ రాష్ట్ర సమితి మైనారిటీలకు ఏదేదో చేయాలని ఆశిస్తే చివరకు ఏమి మిగలలేదని అన్నారు. తర్వాత అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు మొండి చేయి చూపిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆశాకిరణంగా కనపడుతుందని ఆయన అన్నారు. ఎం బి టి భవిష్యత్తులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించబోతున్న అన్ని రకాల ఉద్యమాల్లో తమ పాత్ర ఉంటుందని ముస్లిం మైనారిటీల అండతో రాబోయే రోజులలో రాజ్యాధికారాన్ని సాధించడం ఖాయమని అన్నారు.
విద్యా వ్యాపారం పై పోరాటం
తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతుందని ప్రతి సంవత్సరం 90 వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో 73% ప్రజాప్రతినిధుల చేతిలో ఉన్నాయని అందువల్లే విద్యా హక్కు చట్టం అమలుపట్ల ఉదాసీన వైఖరి కొనసాగుతుందని ఆయన అన్నారు. ఏప్రిల్ 26వ తేదీన జరగబోతున్న విద్యాహక్కు పరిరక్షణ ధర్నాలో విద్యాభిమానులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సాధించబోతున్న అనేక పోరాటాలకు ఈ పోరాటం ఆరంభమని ఈ పోరాటంలో ముస్లిం మైనార్టీ సోదరులు కలిసి రావడం ఇందులో విజయం సాధించడం చరిత్రలో రికార్డు చేయదగ్గ అంశంగా అభివృద్ధి కానున్నదని ఆయన అన్నారు.
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వం పోరాడుతున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగించకుండా చర్చల వైపు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉందని చివరి వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పోరాటంలో కార్మికుల అండగా నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాల్గొన్నారు.









