Shopping cart

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

  • Home
  • Politics
  • జిల్లాకు కొత్త కోర్టు భవనం కావాలి
Politics

జిల్లాకు కొత్త కోర్టు భవనం కావాలి

Email :160

కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన సూర్యపేట జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గము

సూర్యాపేట ఏప్రిల్ 23( మన దీపం )
సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కోర్టు కక్షిదారులు ప్రజల అవసరాల తగ్గట్టు ప్రస్తుతం ఉన్న పాత కోర్టు సరిపోవడం లేదు అందుకోసం నూతన జిల్లా కోర్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కానీ ఈరోజు వరకు భవన నిర్మాణం చేపట్టలేదు. తక్షణ భవన నిర్మాణం అవసరం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు తెలియజేయటానికి ఈరోజు ఉదయం సూర్యపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హసేన్ మరియు కార్యవర్గ సభ్యులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు .ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి తల్లమల్ల హసేన్ విలేకరులతో మాట్లాడుతూ త్వరలో భవన నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించాలని విన్నవించారు

హైకోర్టుకు వినతి పత్రాలు ఇవ్వడానికి హైదరాబాద్ కి వెళ్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలలో, కొత్త హైకోర్టు భవన నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించారని నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని సూర్యాపేట జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్ కేటాయించాలని కోరినారు ప్రస్తుతం భవన నిర్మాణానికి కేటాయించిన ఎనిమిది ఎకరాల భూమి సరిపోదని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇంకా ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హసేన్ సహాయ కార్యదర్శి పసల బాలరాజు కోశాధికారి పెండెం వాణి,గేమ్స్ స్పోర్ట్స్ కార్యదర్శి పత్తిపాక రాధాకృష్ణ మహిళ ప్రతినిధి ఊరగాయత్రి గ్రంథాలయ కార్యదర్శి కూచిపూడి శశిరేఖ,సీనియర్ ఈసీ మెంబర్స్ వసంత సత్యనారాయణ పిల్లే యాదవ్ బొమ్మ గాని శ్రీనివాస్ ఈసీ మెంబర్స్ మీసాల శ్రీను మందల శ్రీనివాస్ బొజ్జ అనిల్ బుక్క సుజాత చెనగాని ప్రణీత పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

Verified by MonsterInsights